calender_icon.png 11 January, 2025 | 1:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ, ఏఎస్పీలు

03-01-2025 10:26:26 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావును జిల్లా ఎస్పీ గౌష్ అలం, ఉట్నూర్ అదనపు ఎస్పీ కాజల్ సింగ్ లు కలిశారు. జిల్లా కోర్టులో జడ్జిని శుక్రవారం కలిసి పూలబొకే అందించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై జడ్జితో ఎస్పీ, ఏఎస్పీ లు కాసేపు చర్చించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో మరింత ఉత్సాహంగా ప్రజలకు సేవలు అందించాలని అన్నారు. ఈ సంవత్సరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ప్రజల శాంతి భద్రతాల విషయంలో పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. జిల్లా జడ్జిని డీఎస్పీ జీవన్ రెడ్డి, సైబర్ క్రైమ్ డీఎస్పీ హబీబుల్లా తదితరులు జడ్జిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.