19-03-2025 10:10:42 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా ఆలయాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించారు. బుధవారం ఆలయానికి వచ్చిన ఎస్పీకి మెస్రం వంశీయులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నాగోబాకు ప్రత్యేక పూజలు చేసిన ఎస్పీని ఆలయ నిర్వాహకులు శాలువాతో సన్మానించి నాగోబా చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఎస్పీ ఆలయ ప్రాంగణాన్ని కలియ తిరుగుతూ ఆలయ విశిష్టతను మెస్రం వంశీయుల ఆచారాలను, ఆలయ చరిత్రను, అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ వెంట ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్, ఉట్నూర్ సీఐ మొగిలి, ఎస్సైలు సునీల్, మనోహర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.