calender_icon.png 12 March, 2025 | 11:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో విస్తృత పర్యటించిన ఎస్పీ

12-03-2025 06:48:33 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలను(Antisocial Activities) పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్(SP Akhil Mahajan) పోలీసు సిబ్బందికి సూచించారు. జిల్లా నూతన ఎస్పీగా ఇటీవల బాధ్యతలను స్వీకరించిన ఎస్పీ తనదైన శైలిలో జిల్లాలో ఆకస్మిక పర్యటనలతో పోలీసు యంత్రాంగం విధులను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగానే జైనథ్ మండలంలో బుధవారం పర్యటించారు. ముందుగా సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎస్పీ స్వామివారికి పూజలు చేసి, ఆలయ స్థల పురాణాన్ని తెలుసుకున్నారు. ఆలయ అధికారులు ఎస్పీని సన్మానించి, స్వామివారి చిత్రపటాన్ని అందించి సన్మానించారు. అనంతరం జైనథ్ పోలీస్ స్టేషన్ ను,  సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది విధులను, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. వివిధ కేసుల్లో గురించి సిబ్బందిని అడిగి ఆరా తీశారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.