13-02-2025 02:10:40 AM
మద్నూర్, ఫిబ్రవరి 12 : మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో కొనుగోలు కేంద్రం మూత పడటంతో మద్నూర్ మరియు డోంగ్లీ మండలాలకు చెందిన రైతుల యొక్క సోయాబీన్ పంట దాదాపు 8 వేల క్వింటాళ్ల దాకా మిగిలిపో యింది. అయితే ఇప్పటికే ఈ విషయం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు తెలంగాణ మార్క్ ఫెడ్ చైర్మన్ మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.
అక్కడితో ఆగకుండా ఢిల్లీకి వెళ్లి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి గారిని మరియు వ్యవసాయ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది ఐఏఎస్ గారిని కలిసి వినతి పత్రం అందజేసి మిగిలిపోయిన సోయా పంటను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేయగా.. వారు సానుకూలంగా స్పందించి ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేసి ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే గారు తెలిపారు.
కాబట్టి రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, చివరి ధాన్యపు గింజ వరకు కొనుగోలు చేసేంత వరకు తాను విశ్రమించబోనని చెప్పారు.. ఎమ్మెల్యేతో మద్నూర్ పీఏసీఎస్ చైర్మెన్ శ్రీను పటేల్ గారు,డోంగ్లీ మండల అధ్యక్షులు రాజు పటేల్ ఉన్నారు.