తేమ ఎక్కువగా ఉందని బోధన్ నుంచి తిరిగి పంపిన అధికారులు
జుక్కల్, డిసెంబర్ 2: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్ మా ర్కెట్ యార్డులో మద్నూర్ సింగిల్ విండో ఆధ్వర్యంలో నాబార్డు ద్వారా సోయా కొనుగో లు కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు 20 వేల క్వింటాళ్ల సోయా పంటను కొన్నట్టు మార్కెటింగ్ శాఖ అధికారులు, సింగిల్ విండో అధికారుల ద్వారా తెలిసింది. ఆ పంటను సోమవారం లారీలో బోధన్ గో దాంకు పంపగా అధికారులు 298 బస్తాలను వెనక్కి పంపారు.
దీంతో మద్నూర్ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. విండో కార్యదర్శిని ప్రశ్నించగా.. గోదాం వద్ద అధికారులు తేమ శాతం పరిశీలించి 298 బ్యాగులు వెనక్కి పంపారని తెలిపారు. అందుకు తాను బాధ్యున్ని కాదని విండో కార్యదర్శి సమాధానం ఇచ్చారు. దీంతో తాము నష్టపోకుండా సింగిల్ విండో అధికారులు, నాబార్డు అధికారులు సహకరించాలని రైతులు కోరుతున్నారు.