హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 23 (విజయక్రాంతి): పర్యాటక రంగంలో 55 ఏండ్లుగా అగ్రగామిగా నిలుస్తోన్న సదరన్ ట్రావెల్స్ కొత్తగా మరో 13 నగరాలకు విస్తరించినట్టు మేనేజింగ్ డైరెక్టర్ ఏ కృష్ణ మోహన్ తెలిపారు. వినియోగదారులకు నగదు డిస్కౌంట్, భారీ ఆఫర్లతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని 13 కొత్త సిటీలకు హాలిడే మార్ట్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
ఈ నెల 24 నుంచి 26 వరకు కాకినాడ, భీమవరం, చీరాల, తిరుపతి, హిందూపురం, కర్నూలు, కడప, ఖమ్మం, సూర్యాపేట, హుబ్లీ, కొయంబత్తూరులో, ఫిబ్రవరి 1 నుంచి 2 వరకు పార్వతీపురం, ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు మహబూబాబాద్‌లో హాలిడే మార్ట్ ఉంటుందన్నారు. ప్రస్తుత హాలిడే మార్ట్‌లో 2 వేల అంతర్జాతీయ, దేశీయ హాలిడే ప్యాకేజీలపై
రూ.60 వేల నగదు డిస్కౌంట్‌తో పాటు సున్న వడ్డీతో ఈఎంఐ సౌకర్యంతో ప్రయాణం చేసే అవకాశం ఉందని చెప్పారు. మహా ధమాకా 2025 లక్కీ డ్రాలో రూ.25 లక్షల విలువైన కియా కార్, మోటార్ బైక్, సింగపూర్ టూర్‌ను గెలుచుకొనే అవకాశముందన్నారు.
మహా కుంభమేళా ప్యాకేజీ కోసం ఢిల్లీ నుంచి కొత్త గ్రూప్ టూర్‌ను ప్రారంభించినట్టు చెప్పారు. సదరన్ ట్రావెల్స్ మహా కుంభమేళా కోసం ప్రత్యేక క్యూరేటెడ్ ప్యాకేజీ అందిస్తుందన్నారు. -యూరప్, సింగపూర్, మలేషియా, థాయ్‌లాండ్, దుబాయ్, ఆస్ట్రేలియా తదితర ప్రపంచ దేశాల్లో టూర్ ప్యాకేజీలు అందిస్తున్నట్టు తెలిపారు.