* జనవరి 31 వరకు అందుబాటులో..
* ట్రావెల్స్ ఎండీ కృష్ణమోహన్
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 30 (విజయక్రాంతి): పర్యాటకులకు 55 ఏళ్లుగా సేవలందిస్తున్న ‘సదరన్ ట్రావెల్స్’ హాలిడే మార్ట్‌ను ప్రకటించినట్టు ఆ సంస్థ ఎండీ ఏ కృష్ణమోహన్ సోమవారం తెలిపారు. మంగళవారం నుంచి జనవరి 31వరకు ఈ మార్ట్ అందుబాటులో ఉంటుందన్నారు.
దేశ, విదేశాల్లో హాలిడే ప్యాకేజీపై అద్భుతమైన నగదు డిస్కౌంట్, ఉచిత హాలిడేస్, ఆకర్షణీయమైన బహుమతులు, మహా ధమాకా, లక్కీ డ్రాలో రూ.25లక్షల విలువైన బహుమతులను పొందే అవకాశాన్ని ప్రయాణికులకు కల్పించినట్టు ఆయన పేర్కొన్నారు.
మహాకుంభ్ కోసం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే 500మందికి ఆ సంస్థ భారీ తగ్గింపు ఇచ్చినట్టు చెప్పారు. దేశంలోని తీర్థయాత్రాస్థలాలు, శ్రీలంక, కంబోడియాతోపాటు 14రోజుల యురోపియన్ ప్యాకేజీలు అత్యంత ప్రాచుర్యం పొందినట్లు ఆయన వివరించారు. తమ గ్రూప్‌లో న్యూఢిల్లీ, వారణాసి, జైపూర్, విజయవాడలో 200 ముఖ్యమైన హోటళ్లు ఉన్నట్టు చెప్పారు.
వారణాసిలోని కాశీ ఆలయ కారిడార్ ప్రాంగణంలో ఆలయానికి 50మెట్ల దూరంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘భీమశంకర్ గెస్ట్ హౌజ్’ను నిర్వహిస్తున్నందుకు తమ బృందానికి అవార్డు లభించిందని చెప్పారు.