06-03-2025 12:54:17 AM
చెన్నై, మార్చి 5: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ కు దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకమని తమిళ నాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నాయక త్వంలో బుధవారం చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశం స్పష్టం చేసింది. 1971 జనా భా లెక్కల ప్రాతిపదికను తీసుకుంటే బాగుంటుందని స్టాలిన్ కేంద్రానికి హితవు పలికారు.
డీలిమిటేషన్, భాషా వివాదంపై జరి గిన అఖిలపక్ష సమావేశంలో, 1971 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరిగేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరు తూ స్టాలిన్ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దక్షిణాది రాష్ట్రాలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేసి పోరాటం ఉదృతం చేయాలని పిలుపునిచ్చా రు.
లోక్‌సభ పునర్విభజనకు వ్యతిరేకం కాద ని పేర్కొన్న స్టాలిన్, 2026 జనాభా లెక్కల ఆధారంగా విభజన ప్రక్రియ జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గత 30 ఏళ్లుగా జనాభా నియంత్రణ పద్ధతులను సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే ప్రతిఫలం ఇదేనా అని ప్రశ్నించారు.
ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రి య చేపడితే పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రా లు ఎక్కువసీట్లు కోల్పోయే అవకాశముందన్నారు. ఈ చర్య దక్షిణాది రాష్ట్రాల గొంతును నొక్కేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు జాతీయ భాషా విధానం ప్రవేశాన్ని వ్యతిరేకించిన స్టాలిన్ రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి హిందీని తొలగించాలని డిమాండ్ చేశారు.
కేంద్రానికి తమిళంపై ప్రేమ ఉంటే మాటల్లో కాదని చేతల్లో చూపించాలని హితవు పలికారు. పార్లమెంట్‌లో సెంగోల్‌ను ఏర్పాటు చేయడం కంటే.. రాష్ట్రంలో ఉన్న కేంద్ర కార్యాలయాల్లో హిందీని తొలగించడం మంచిదని అభిప్రాయపడ్డారు. హిందీకి బదులు తమిళంను అధికారిక భాషగా మార్చి మరిన్ని నిధులు కేటాయించాలన్నారు.
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం: విజయ్
లోకసభ నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ వ్యాఖ్యా నించారు. పునర్విభజన ప్రక్రియపై కేంద్రం ఆయా రాష్ట్రాలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరారు. తాజా జనాభా లెక్కల ఆధారంగా విభజన ప్రక్రియ జరిగితే పార్లమెంట్‌లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గే ప్రమాదముందని పేర్కొన్నారు.
గత 50 ఏళ్లలో తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదలని నియంత్రించాయని గుర్తుచేశారు. ఈ క్రమంలో ప్రస్తుత జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలు విభజించడం సరికాదని కేంద్రానికి హితవు పలికారు.
హిందీయాగా మార్చే యత్నం: కమల్
స్టాలిన్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డీలిమిటేష న్, భాషా వివాదంపై స్పం దించిన కమల్.. డీలిమిటేషన్, త్రిభాషా విధానం ద్వారా తమిళ నాడు సహా దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
ఈ క్రమంలోనే ఇండియాను ‘హిందీయా’గా మార్చే ప్రయ త్నం జరుగుతుందని విమర్శించారు. మనం ఇండియా గురించి ఆలోచిస్తుంటే వారు మాత్రం హిందీయా అని కలలు కంటున్నారు. తమిళ ప్రజలు భాష కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన విషయం కేంద్రం గుర్తుపెట్టుకోవాలని కమల్ ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే.