calender_icon.png 13 January, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కిమ్ రాజ్యంలోకి దక్షిణ కొరియా డ్రోన్!

20-10-2024 03:03:46 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య వైరం నానాటికీ తీవ్రమవుతూన్న క్రమంలో  తాజాగా దక్షి ణ కొరియాకు చెందిన ఓ డ్రోన్ తమ భూభాగంలో కనిపించిందని కిమ్ సర్కార్ వెల్లడించింది. ఈ డ్రోన్ ఫొటో ను ఆ దేశ అధికారిక మీడియా విడుదల చేసింది. ఈ నెలలో దక్షిణ కొరి యా మూడుసార్లు ఇలాంటి డ్రోన్‌ల తో ప్రచార కరపత్రాలను వదిలినట్లు  కిమ్ సర్కార్ ఆరోపించింది.

గత నెల లో దక్షిణ కొరియా సైనిక కవాతులో కనిపించిన డ్రోన్ రకమే తమ దేశంపై కి వదిలారని ఉత్తరకొరియా మిలిటరీ, స్టేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు సంయుక్తంగా నిర్ధారించాయి. 

డ్రోన్‌ల ద్వారా తమ భూభాగంలో కరపత్రాలు వదలడాన్ని తీవ్రంగా ఖండించిన ఉత్తరకొరి యా మరోసారి తమ గగనతలంలో డ్రోన్‌లు ఎగిరేసినా, సరిహద్దుల్లో నిబంధనలు ఉల్లంఘించినా యుద్ధప్రకటనగా పరిగణిస్తామని, ప్రతీకారం చాలా తీవ్రంగా ఉంటుందని కామెంట్ చేసింది. కాగా.. మే చివరి వారం నుంచి దక్షిణ కొరియా గగనతలంపైకి కిమ్ ప్రభుత్వం వేల సంఖ్యలో చెత్త బెలూన్లు పంపించింది.