calender_icon.png 23 October, 2024 | 8:04 PM

స్పిరిట్ విలన్‌గా సౌత్ కొరియన్

09-07-2024 12:05:00 AM

‘యానిమల్’, ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ వంటి చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు సందీప్‌రెడ్డి వంగా. ఆయన తెరకెక్కించనున్న మరో చిత్రంపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొన్నది. అదే ‘స్పిరిట్’. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ ఏడాది చివరలో ప్రారంభించనున్నట్టు ఇప్పటికే సంకేతాలిచ్చారు ఈ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి. నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా కూడా ఈ సినిమాలో ప్రభాస్ కెరీర్‌లో తొలిసారి ఖాకీ డ్రెస్ వేసుకోబోతున్నాడన్న విషయాన్ని గతంలో వెల్లడించారు.

భారతీయ భాషలతోపాటు చైనీస్, కొరియన్ భాషల్లో ‘స్పిరిట్’ను విడుదల చేయనున్నది తెలిసిన వార్తే. ఇంకా ఈ చిత్రానికి సంబంధించి అప్‌డేట్‌ల గురించి అభిమానులు ఎదురు చూస్తున్న తరుణంలో విలన్ పాత్రధారి గురించిన వార్త ఒకటి తాజాగా తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో పాపులర్ దక్షిణ కొరియాకు చెందిన నటుడు మడాంగ్ సియోక్ ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నారట. మడాంగ్ సియోక్ నటించిన ‘బడ్లాండ్ హంటర్స్’ చిత్రం ఈ ఏడాది జనవరిలో విడుదలై, సౌత్ కొరియన్ ప్రేక్షకుల ఆదరణ పొందింది.