సియోల్,(విజయక్రాంతి): ఏఐ రంగంలో చైనా సంస్థ డీప్‌సీక్ ఒకవైపు దూసుకెళ్తుంటే మరోవైపు దీనిపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజా దక్షిణ కొరియా(South Korea) కూడా చైనాకు చెందిన డీప్‌సీక్‌ను నిషేధించింది. దేశ భద్రత దృష్ట్యా దక్షిణ కొరియా రక్షణ, వాణిజ్య కంప్యూటర్లలో డీప్‌సీక్(Deepseek) వాడకాన్ని నిషేధిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దేశం పర్యావరణ మంత్రిత్వశాఖ కూడా ఇదే హెచ్చరికలను జారీ చేసినట్లు సమాచారం. అమెరికాలో చైనాకు చెందిన ప్రభుత్వ టెలికాం సంస్థతో డీప్‌సీక్‌కు సంబంధాలు ఉన్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. కంప్యూటర్ కోడ్ ద్వారా యూజర్ల లాగిన్ సమాచారాన్ని ఆ టెలికాం సంస్థకు అందజేస్తుందని వారు తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో, డీప్‌సీక్ సేవలను ఆస్ట్రేలియా, ఇటలీ, తైవాన్ వంటి దేశాలు ఇప్పటికే నిషేధించాయి. మొదట కెనడాకు చెందిన ఫీరూట్ సెక్యూరిటీ సంస్థ ఈ విషయం గుర్తించింది. ఈ డేటా బదిలీ జరిగిందో లేదా అన్నది మాత్రం ఈ సంస్థలు గుర్తించలేకపోయాయి. ప్రైవసీ పై సమస్యలను పరిష్కరించడంలో డీప్‌సీక్ విఫలమైన తర్వాత, ఇటలీ డేటా ప్రొటెక్షన్ అథారిటీ చాట్‌బాట్‌ను బ్లాక్ చేస్తూ ప్రకటించింది. అలాగే, తైవాన్ కూడా ప్రభుత్వ సంస్థలలో డీప్‌సీక్ వినియోగాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.