- 39వ షో రూమ్‌గా మహబూబ్ నగర్‌లో అంకురార్పణ
- సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రముఖ సినీ తార ఊర్వశి రౌతేలా
మహబూబ్ నగర్, ఫిబ్రవరి 1 (విజయ క్రాంతి) : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శనివారం సౌత్ ఇండియా షా పింగ్ మాల్ ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. షోరూం ప్రారంభ వేడుకలకు హాజరైన ప్రముఖ సినీ తార ఊర్వశి రౌతేలా జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించిన అనంతరం షోరూమ్ ను పరిశీలించి నమ్మకానికి నిలువెత్తు నిదర్శ నంలా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రజలకు వస్త్రాలను అందుబాటులో ఉంచి మంచి వాతావరణంలో వ్యాపారం చేస్తూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాం క్షించారు. ప్రముఖ సినీ తార ఊర్వశి రౌతేలా షో రూమ్ లోని అన్ని విభాగాలలో ఉంచిన వస్త్రాలను ప్రత్యేకంగా పరిశీలించారు.
మహ బూబ్ నగర్ లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారంభ వేడుకలకు హాజరు కావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తక్కువ ధరల్లోనే వినియోదారులకు వస్త్రా లు అందుబాటులో ఉంచేందుకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇక్కడికి వచ్చిం దని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై డాకు మహారాజు చిత్రంలోని ఓ పాటకు చిన్నపాటి నత్యం చేసి అందరిని అలరించారు.
సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్ సురేష్ సీర్ణ తక్కువ ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందుబాటులో ఉం చేందుకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 39 షో రూమ్ను మహబూబ్ నగర్ లో ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
వినియోగదారులు పెట్టు కున్న నమ్మకండి రెట్టింపు చేస్తూ వస్త్రాలను అందుబాటులో ఉంచి ప్రజల మండలాలు పొందుతామని తెలిపారు. ఈ ప్రారంభో త్సవ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మ న్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మ ద్, కౌన్సిలర్ లక్ష్మణ్, సౌత్ ఇండియా షాపిం గ్ మాల్ సంస్థ డైరెక్టర్లు అభినయ్, రాకేష్, కేశవ్ ఉన్నారు.