టెస్టు సిరీస్ సౌతాఫ్రికాదే
కేప్‌టౌన్: సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికా క్లీన్‌స్వీప్ చేసింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 61 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు కేవలం 7.1 ఓవర్లలోనే టార్గెట్‌ను అందుకోవడం విశేషం. డేవిడ్ బెడింగమ్ (47*), మార్కరమ్ (14*) విజయతీరాలకు చేర్చారు. అంతకముందు ఫాలోఆన్ ఆడిన పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 478 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ షాన్ మసూద్ (251 బంతుల్లో 145) సెంచరీతో కదం తొక్కగా.. బాబర్ ఆజం (81) రాణించాడు. మిడిలార్డర్‌లో రిజ్వాన్ (41), సల్మాన్ అగా (48) పర్వాలేదనిపించారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ, కేశవ్ మహరాజ్ చెరో 3 వికెట్లు పడగొట్టగా .. మార్కో జాన్సెన్ రెండు వికెట్లు తీశాడు.
దీంతో పాక్ సఫారీల ముందు స్వల్ప లక్ష్యమే ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 615 పరుగుల భారీ స్కోరు సాధించిన సంగతి తెలిసిందే. రికెల్‌టన్ (259) ద్విశతకంతో అలరించగా.. బవుమా, వెరిన్నే శతకాలతో అదరగొట్టారు. రికెల్‌టన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, మార్కో జాన్సెన్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ గెలుచుకున్నారు. రెండు టెస్టుల సిరీస్‌ను 2 గెలిచిన సౌతాఫ్రికా ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. గతేడాది ఆగస్టు నుంచి సౌతాఫ్రికాకు టెస్టుల్లో ఇది వరుసగా ఏడో విజయం కావడం విశేషం. నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తొమ్మిది టెస్టుల అనంతరం అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా బవుమా (8 విజయాలు) రికార్డులకెక్కాడు.