పాకిస్థాన్‌తో తొలి టెస్టు
సెంచూరియన్: సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా పట్టు బిగించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 22 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. మార్కరమ్ (47), బవుమా(4) క్రీజులో ఉన్నారు. పాక్ బౌలర్లలో షహజాద్(2), మహ్మద్ అబ్బాస్ ఒక వికెట్ పడగొట్టారు. అంతకముందు పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో (211) పరుగులకు ఆలౌటైంది. కమ్రాన్ గులామ్ (54) అర్థసెంచరీతో రాణించగా.. అమెర్ జమల్ (28), రిజ్వాన్ (27) పర్వాలేదనిపించారు. సఫారీ బౌలర్లలో డేన్ పాటర్సన్ 5 వికెట్లు పడగొట్టగా.. కొర్బిన్ బోస్క్ 4 వికెట్లు పడగొట్టాడు.