చట్టోగ్రామ్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 307 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ జోర్జి (141*), స్టబ్స్ 106 సెంచరీలతో కదం తొక్కారు.
బంగ్లా బౌలర్లలో తైజులై రెండు వికెట్లు తీసుకున్నాడు. మొదటి టెస్టులో ఓడిన బంగ్లాదేశ్ రెండో టెస్టు తొలి రోజు కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.