calender_icon.png 6 January, 2025 | 1:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సౌరవ్ గంగూలీ కుమార్తె కారును ఢీకొట్టిన బస్సు

04-01-2025 12:11:12 PM

ప్రముఖ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూతురు(Sourav Ganguly Daughter) సనా గంగూలీ కారును బస్సు ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. కోల్‌కతాలోని డైమండ్ హార్బర్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఢీకొన్న ఘటనలో సనా కారు దెబ్బతినగా, సనా గంగూలీ(Sana Ganguly accident) క్షేమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో, కారును గంగూలీ డ్రైవర్ నడుపుతుండగా, సనా ముందు ప్యాసింజర్ సీటులో కూర్చుంది. బెహలా చౌరస్తా వద్ద ఢీకొన్న తర్వాత బస్సు డ్రైవర్ ఆగకుండా పరారయ్యాడని పోలీసులు తెలిపారు. సనా, డ్రైవర్‌తో కలిసి బస్సును అడ్డగించేలోపే కొద్ది దూరం వెంబడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సనా గంగూలీ ఇంకా అధికారికంగా ఫిర్యాదు చేయలేదని అధికారులు స్పష్టం చేశారు.