calender_icon.png 23 October, 2024 | 9:00 AM

లౌడ్ స్పీకర్లతో శబ్ద కాలుష్యం

23-10-2024 12:00:36 AM

ఐఏఎస్ అధికారి విమర్శలు

హిందూ సంఘాల ఆగ్రహం

మధ్యప్రదేశ్‌లో వివాదం

భోపాల్, అక్టోబర్ 22: దేవాలయాల వద్ద అమర్చిన లౌడ్ స్పీకర్ల కారణంగా శబ్ద కాలుష్యం జరుగుతుందంటూ ఐఏఎస్ అధికారిణి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారానికి దారి తీసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. సీనియర్ ఐఏఎస్ అధికారిణి మాటలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం  దు ర్గా నిమజ్జన వేడుకల్లో ఏర్పాటు చేసిన డీజే వద్ద 13 ఏళ్ల బాలుడు డ్యాన్స్ చేస్తూ మృతి చెందాడు. దీంతో శబ్ద కాలుష్యం అంశంపై సోషల్ మీడియాలో చర్చ ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఓ జర్నలిస్ట్ మజీద్‌ల వద్ద ఏర్పాటు చేసిన మైక్‌ల గురించి ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. దీంతో సాధారణ పరిపా లనశాఖలో కార్యదర్శిగా పని చేస్తున్న శైలబాల మార్టిన్ స్పందించారు.

“ దేవాల యాల వద్ద ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లు శ బ్ద కాలుష్యానికి కారణం అవుతున్నాయి. లౌ డ్ స్పీకర్ల నుంచి వచ్చే శబ్దాలు కొన్ని వీధుల వరకూ వినిపిస్తున్నాయి. అర్ధరాత్రి వరకూ అవి మోగుతూనే ఉంటున్నాయి” అని అ న్నారు. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ బాధ్యతలు స్వీకరిం చిన వెంటనే మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారనే విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీంతో ఐఏఎస్ అధికారిణి వాఖ్యలపై హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.