01-03-2025 05:58:17 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గం మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా నిర్మల్ మండలంలోని ముజ్గి గ్రామానికి చెందిన ఏ సౌమ్య నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్న సౌమ్య కథ పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో మండలంలో విస్తృతంగా ప్రచారం చేయడంతో ఆమె సేవలకు గుర్తింపుగా నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా మహిళా విభాగానికి ఎంపిక చేయడం జరిగిందని పార్టీ మండల అధ్యక్షులు గంగాధర్ తెలిపారు.