06-04-2025 12:26:48 PM
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూడూరు గ్రామంలోని ఓ ఫామ్ హౌస్ లో ఎస్ఓటీ పోలీసులు శనివారం అర్ధ రాత్రి దాడి చేసి 18 మంది పేకాట రాయులను పట్టుకున్నారు. పేకాట ఆడుతున్న వ్యక్తుల వద్ద నుండి సుమారు రూ.4 లక్షల నగదుతో పాటు 16 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీరిపై మేడ్చల్ పోలీసులు గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఫామ్ హౌస్ శ్రీనివాసరావు అనే వ్యక్తికి చెందినది. పేకాటలో పట్టుబడిన వారందరూ మేడ్చల్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.