19-03-2025 01:54:58 AM
చేర్యాల, మార్చి 18 ప్రభుత్వ నిబంధనలు పాటించాని వెంచర్లలో స్థలాలుకొను గోలు చేసిన వారు తమ ప్లాట్లను క్రమాబద్ధీకరించుకోవాలని నోడల్ అధికారి శ్రీలత అన్నారు. చేర్యాల పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్లాట్లు కొనుగోలుదారులకు ఎల్‌ఆర్‌ఎస్ పైన అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం నిబంధనలు పాటించని వెంచర్లలో స్థలలు కొనుగోలు చేసిన వారు, వాటిని క్రమ భ్రదీకరించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లిస్తే స్థలం క్రమబద్ధీకరించడం జరుగుతుందన్నారు. క్రమబద్ధీకరించుకోవడానికి చెల్లించాల్సిన ఫీజులో 25శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది అన్నారు.
ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలన్నారు. క్రమబద్ధీకరించుకున్న ప్లాట్లకు బ్యాంకు రుణం కూడా సులభంగా లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ రిజిస్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.