calender_icon.png 17 January, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సారీ నాకు తెలియదు!

02-09-2024 12:00:00 AM

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై జస్టిస్ కె. హేమ కమిటీ ఇచ్చిన నివేదిక దేశవ్యా ప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనపై సినీ నటులు, సెలబ్రిటీలు, ప్రముఖులు స్పందించి తమ అభిప్రా యాలను వ్యక్తం చేశారు. అయితే తాజాగా అగ్రనటుడు రజనీకాంత్ ను హేమ కమిటీపై మీడియా ప్రశ్నించింది. ప్రస్తుతం అన్ని చిత్ర పరిశ్రమల్లో లైంగిక వేధింపులు వెలుగుచూస్తున్నాయి. కోలీవుడ్ లోనూ హేమ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా? అని రజనీని అడగ్గా “దాని గురించి నాకు తెలియదు సారీ” అని బదులిచ్చారు.

ప్రస్తుతం ఇది వైరల్గా మారింది. గత కొన్నిరోజులుగా చర్చనీ యాంశంగా మారిన విషయం తనకు తెలియద నడం గమనార్హం అని పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రజనీ కాంత్ ‘వేట్టైయాన్’ మూవీతో బిజీగా ఉన్నారు. ఇది “అక్టోబర్10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి టి.జె. జ్ఞానవేల్దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్ పతాకంపై ఇది నిర్మితమైంది. అమితాబ్బచ్చన్, ఫహద్ఫాజిల్, రానా కీలక పాత్రలు పోషించారు.