calender_icon.png 20 January, 2025 | 6:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాపం కరోలినా

05-08-2024 12:05:00 AM

బ్యాడ్మింటన్‌లో మహిళల మాజీ నంబర్‌వన్ కరోలినా మారిన్ గాయంతో ఒలింపిక్స్ నుంచి వైదొలిగింది. సెమీస్ చేరిన ఈ స్పెయిన్ చిన్నది.. గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే తప్పుకోవడంతో ప్రత్యర్థికి వాకోవర్ లభించింది. దీంతో మ్యాచ్ రిఫరీ చైనా క్రీడాకారిణి హీ బింగ్ జియావోను విజేతగా ప్రకటించారు. అయితే తొలి గేమ్ నెగ్గి పూర్తి ఆధిపత్యంలో ఉన్న కరోలినా రెండో గేమ్‌లోనూ 10 ప్రత్యర్థిపై పైచేయిలో ఉన్నప్పుడు మోకాలి నొప్పి ఇబ్బందిపెట్టింది. నొప్పితో విలవిల్లాడిన కరోలినా కోర్టులోనే కుప్పకూలింది. ఆ తర్వాత ఫిజియో సాయంతో పైకి లేచిన కరోలినా ఉబికివస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఒలింపిక్స్ నుంచి భారంగా నిష్క్రమించింది.  ఆ తర్వాత స్ట్రెచర్‌పై ఆమెను ఆసుపత్రికి ప్రాథమిక చికిత్సకు తరలించారు.2016 రియో ఒలింపిక్స్‌లో కరోలినా మారిన్ స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే.