14-04-2025 01:49:05 AM
క్వింటాలుకు మద్దతు ధర రూ. 3,371
ఎకరాకు 8 క్వింటాళ్ల 65 కేజీల కొనుగోలు
విండో చైర్మన్ హనుమంత్ రెడ్డి
పెద్ద కొడప్గల్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రం ప్రాథమిక సహకార సంఘం లో ఆదివారం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని, పి ఎస్ సి ఎస్ చైర్మన్ కె, హనుమంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జొన్న పంటను సాగు చేసిన రైతులు చాలా రోజులుగా ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మార్క్ ఫెడ్ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వ్యవసాయ సహకార సంఘం పెద్ద కొడప్గల్ ఆధ్వర్యంలో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు.
క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర రూ: 3,371 లతో ఎకరాకు 8 క్వింటాళ్ల 65 కేజీల వరకు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. రైతుల వద్ద ఉన్న పూర్తి పంటను కొనుగోలు చేసే వరకు కేంద్రాల నిర్వహణ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ నాగిరెడ్డి, హనుమయ్య, కిషన్, దస్తా రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ఏ ఈ ఓ రాజ్యలక్ష్మి, రూప , సహకార సంఘం కార్యదర్శి బి, సందీప్ కుమార్, కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు చిప్ప మోహన్, డాక్టర్ సంజీవ్, సంఘం సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.