calender_icon.png 11 April, 2025 | 1:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జొన్న పంట దగ్ధం

02-04-2025 12:00:00 AM

ఆదిలాబాద్, ఏప్రిల్ 1 (విజయ క్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం దీపాయి గూడ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో జొన్న పంట దగ్దమైనది. వేసవి కాలంలో పంట పొలాల్లో దూరలకు నిప్పుపెట్టె క్రమంలో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో గ్రామానికి చెందిన గిరిధర్ రెడ్డి కి చెందిన మూడెకరాల జొన్న పంట కు నిప్పు అంటుకుని కాలి బూడిదయింది.

వెంటనే స్థాని-కులు అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేసరికి జొన్న పంట పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రెండు లక్షల మేర జొన్న పంట నష్టం జరిగినట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు.