calender_icon.png 26 April, 2025 | 1:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జొన్నలు, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

25-04-2025 01:08:08 AM

జొన్నల పరిమితి ఎకరానికి14 క్వింటాళ్లు పెంచినందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి  క్షీరాభిషేకం

పెద్ద కొడఫ్గల్ ఏప్రిల్ 24 (విజయ క్రాంతి) కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం కాటేపల్లి గ్రామం లో గురువారం జొన్నలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రం సింగిల్ విండో చైర్మన్ జార నాగిరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించబడింది ఈ సందర్భంగా మాట్లాడుతూ జొన్నలు ఎకరానికి 8.65 క్వింటాళ్ల నుండి 14 క్వింటాళ్ల వరకు.పరిమితి పెంచినందుకు ప్రభుత్వానికి ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు కు ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేశారు. A  ,గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాలు ధర 2320 రూపాయలు, B , గ్రేడ్  వరి ధాన్యానికి 2300 రూపాయలు జొన్నలు క్వింటాలు ధర 3371 రూ కొనుగోలు ధర తో కేంద్రాని ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో చిన్న కొడప్గల్ సింగిల్ విండో చైర్మన్ జార నాగిరెడ్డి,వైస్ చైర్మన్ గంగాగౌడ్,కార్యదర్శి హన్మండ్లు,ఏఈఓ రూపా, కాంగ్రెస్ పార్టీ నాయకులు మొహిద్దిన్, వెంకట్ రెడ్డి, పెంటన్న, లలితా గంగా రెడ్డి, మల్లప్ప పటేల్,కుమ్మరి సాయిలు, మొగుల గౌడ్,   విఠల్, రాంచందర్, శంకర్, లాలు, అశోక్, శ్రీనివాస్, సంగణ్ణ, పాండు నాయక్, రైతులు పాల్గొన్నారు