calender_icon.png 25 November, 2024 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

28న సోరెన్ ప్రమాణం

25-11-2024 02:58:15 AM

  1. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి హేమంత్
  2. గవర్నర్‌కు రాజీనామా సమర్పించిన జేఎంఎం చీఫ్
  3. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి

రాంచీ, నవంబర్ 24: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి ఇండియా కూటమి నిర్ణయాత్మక విజయం సాధించింది. ఈ నేపథ్యంలో జేఎంఎం నేతృత్వంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ ఈ నెల 28న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆదివారం జరిగిన భాగస్వామ్య పక్షాల భేటీలో హేమంత్‌ను కూటమి నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సమావేశం అనంతరం జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్‌ను కలిసిన హేమంత్ ముఖ్యమంత్రిగా తన రాజీనామా అందించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు సిద్ధంగా ఉన్నట్లు గవర్నర్‌కు తెలియజేశారు. ఈ మేరకు భాగస్వామ్య పక్షాల మద్దతు లేఖను సోరెన్ అందజేశారు. హేమంత్ విజ్ఞప్తిని అంగీకరించిన గవర్నర్ నవంబర్ 28న ప్రమాణం చేసేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని హేమంత్‌కు సూచించారు. 

కృతజ్ఞతలు చెప్పిన సోరెన్

గవర్నర్‌తో భేటీ తర్వాత సోరెన్ మాట్లాడుతూ.. మళ్లీ అవకాశమిచ్చినందుకు జార్ఖండ్ ప్రజలకు కృతజ్ఞతలు. రాష్ట్రంలో జేఎంఎం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించాం. ఈ మేరకు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరాం. నేను కూడా నా రాజీనామాను సమర్పించా.

నాతో పాటు కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు కూడా వచ్చారు. నవంబర్ 28న కొత్త ప్రభు త్వం కొలువుదీరుతుంది అని పేర్కొన్నారు. జా ర్ఖండ్‌లోని మొత్తం 81 సీట్లకు గాను జేఎంఎం కూటమి 56 సీట్లు కైవసం చేసుకుంది.  జే ఎంఎం 34 స్థానాల్లో జయభేరి మోగించింది.