ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం
న్యూఢిల్లీ, నవంబర్ 27: జార్ఖండ్ తాత్కాలిక ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీసమేతంగా ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి తన ప్రమాణ స్వీకారో త్సవానికి అహ్వానించారు. నవంబర్ 28న రాంచీలోని మోర్హబడి మైదానం కేంద్రం గా జరిగే కార్యక్రమానికి రావాల్సిందిగా సోరెన్ దంపతులు ప్రధానిని కోరారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలతోపాటు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అర వింద్ కేజ్రివాల్లను కూడా సోరెన్ దంపతులు అహ్వానించారు. ఈ కార్యక్రమానికి బెంగాల్ మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.