calender_icon.png 8 January, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెనాల్టీ షూటౌట్ ద్వారా ఫలితం

06-01-2025 11:27:31 PM

ఢిల్లీపై సూర్మా హాకీ క్లబ్ విజయం

భువనేశ్వర్: హాకీ ఇండియా లీగ్(Hockey India League)(హెచ్‌ఐఎల్)లో సూర్మా హాకీ క్లబ్(Soorma Hockey Club) థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది. సోమవారం ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్‌(Delhi SG Pipers)తో జరిగిన మ్యాచ్‌లో సూర్మా హాకీ క్లబ్ 3 (పెనాల్టీ షూటౌట్ ద్వారా) గెలుపును అందుకుంది. నిర్ణీత సమయం ముగిసేలోగా ఇరుజట్లు 2 సమంగా నిలిచాయి. ఫస్ట్‌హాఫ్ ముగిసిన అనంతరం ఢిల్లీ ఎస్‌జీ పైపర్స్ తరఫున టోమస్ డొమినే (ఆట 43వ నిమిషంలో), మన్‌జీత్ సింగ్ (45వ ని.లో) గోల్స్ సాధించగా.. ఆ తర్వాత హర్మన్ ప్రీత్ సింగ్ (48, 57వ ని.లో) డబుల్ గోల్స్‌తో మెరిసి స్కోర్లను సమం చేశాడు. ఆ తర్వాత ఇరుజట్లు గోల్ కోసం ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకపోయాయి. షూటౌట్‌లో సూర్మా హాకీ క్లబ్ మూడో గోల్స్ కొట్టగా.. ఢిల్లీ ఒక్క గోల్‌కే పరిమితమైంది. ఈ విజయంతో సూర్మా హాకీ క్లబ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోగా.. ఢిల్లీ ఆరో స్థానంలో నిలిచింది.