calender_icon.png 9 October, 2024 | 5:00 AM

త్వరలో విద్యుత్‌శాఖలో భారీ నోటిఫికేషన్

09-10-2024 02:50:32 AM

ఉద్యోగుల పిల్లల కోసం ఒక పథకం పెడతాం

ప్రభుత్వం ఏర్పడగానే పదోన్నతలు కల్పించాం

విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు 

గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి పటిష్ట ప్రణాళికలు చేశాం

దసరా కానుకగా పెండింగ్ బిల్లుల క్లియరెన్స్

ఇకనుంచి ప్రతి నెలా బిల్లుల చెల్లింపు

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటన

ఖమ్మం, అక్టోబర్ 8 (విజయక్రాంతి): గత ప్రభుత్వం విస్మరించినా.. ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే విద్యుత్ శాఖలో పదోన్నతులు  కల్పించామని, ఖాళీలను భర్తీ చేయడానికి త్వరలో భారీ నియామక ప్రకటన వేస్తామని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

విద్యుత్ శాఖ ఉద్యోగుల పిల్లల కోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించారు. విద్యు త్‌శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించాలని అధికారులను ఆదశించారు.

మంగళవారం ఖమ్మం కలెక్టరేట్‌లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల విద్యుత్ అధికారులతో విద్యుత్ శాఖ పనితీరుపై ఆ శాఖ సీఎండి వరుణ్‌రెడ్డి, కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాబోయే కాలానికి  అనుగుణంగా విద్యుత్‌వినియోగం ఎంతున్నా అందించేందుకు ముంద స్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపా రు.

గరిష్ఠ డిమాండ్ ఉన్నా విద్యుత్ సరఫరా అ ందించామని స్పష్టంచేశారు. ఇటీవల కురిసి న అతి భారీ వర్షాలు, వరదల సమయంలో అర్ధ రాత్రి సైతం లెక్క  చేయకుండా నీళ్లల్లో పనిచేసి న ప్రతి ఒక్క విద్యుత్ ఉద్యోగిని అభినందించారు.  

భవిష్యత్ అవసరాల కోసం 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ 

భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని 2029 30 వరకు గ్రీన్ ఎనర్జీ 20 వేల మెగావాట్ల ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. రోజురోజుకూ విద్యుత్  వినియోగం పెరుగుతున్న దృష్ట్యా వి ద్యుత్ వ్యవస్థను మరింత పటిష్టపరచడానికి కా వాల్సిన బడ్జెట్‌ను పెట్టుకుని ముందుకు పోతున్నామని చెప్పారు.

ట్రాన్స్‌ఫార్మర్లపై లోడ్ భార ం పడకుండా కావాల్సిన ట్రాన్స్‌ఫార్మర్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. గృ హ  జ్యోతికి సంబ ంధించి 200 యూనిట్లలో పు  వారికి ఉచిత కరెంట్ అందిస్తున్నామని, ఉమ్మడి ఖమ్మం సర్కిల్ పరిధిలో ఇప్పటివరకు 26 లక్షల వినియోగదారులకు లబ్ధి చేకూరిందని తెలిపారు. 

సిబ్బంది శిక్షణకు కళాశాల

సాంకేతికంగా ఎప్పటికప్పుడు వ్యవస్థలో మార్పులు వస్తున్నాయని, అందుకు అనుగుణంగా శిక్షణ అందిపుచ్చుకుని ముందుకు పోవాలని భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ శాఖకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి, వారికి ఆధునిక సాంకేతిక శిక్షణ అందించాలని, అందుకోసం శిక్షణ కళాశాల ఏర్పాటు చేసేందుకు ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణతోనే మరింత అభివృద్ధిలోకి వెళతామని చెప్పారు. 

విద్యుత్ శాఖకు రూ.30 కోట్ల నష్టం 

ఇటీవల కురిసిన భారీవర్షాలకు  విద్యుత్ శాఖకు రూ.30 వేల కోట్ల నష్టంవాటిల్లిందని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు.  అర్ధరాత్రి సైతం లెక్క చేయకుండా నీళ్లల్లో యుద్ధప్రాతిపదికన పునరద్ధరణ పనులు చేశామని చెప్పారు. తండాల్లో ప్రమాదాలు నివారించడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి సోమవారం విద్యుత్ ప్రజావాణి ఏర్పాటు చేశామన్నారు.  

వరదల్లో ధైర్య సాహసాలతో సేవలు 

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదల్లో అత్యంత ధైర్య సాహసాలతో విద్యుత్ సరఫరా అందించిన విద్యుత్ సిబ్బందిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ అభినందించారు. విద్యుత్ వినియోగానికి అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. పంట పొలాల్లో వంగిపోయిన విద్యుత్ స్తంభాలను మార్చాలని కోరారు.

ఎప్పుడు ఫోన్ చేసినా క్రింది స్థాయి సిబ్బంది స్పందించాలని సూచించారు. అనంతరం వర్షాల సమయంలో మెరుగైన సేవలందించిన అధికారులకు సీఎండి ప్రశంసా పత్రాలను అందజేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, మాలోత్ రాందాస్‌నాయక్, ఇంచార్జ్ డైరెక్టర్ ( హెచ్‌ఆర్డీ) బీ అశోక్‌కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

రైతుకు ఆదాయం వచ్చేలా సోలార్ పంపు సెట్లు 

వ్యవసాయానికి ఉచిత కరెంట్‌తోపాటు ఆదాయం కూడా వచ్చేలా వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ ప్లాంట్‌లు పెడుతున్నామని, పైలట్ ప్రాజెక్టు కింద మధిరలోని సిరిపురాన్ని ఎంపిక చేసినట్టు భట్టి వెల్లడించారు. గ్రామంలోని ఇళ్లకు కూడా సోలార్  ప్యానల్స్ పెట్టి సోలరైజేషన్ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

సిరిపురంతోపాటు కొడంగల్ , అచ్చంపేటలోనూ సౌర విద్యుద్ధీకరణ చేస్తున్నామని తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరి ంచడానికి పొలంబాట చేపడుతున్నామని వివరించారు. ట్రాన్స్‌ఫార్మర్ల షెడ్లను తరచూ తని ఖీ చేయాలని, మళ్లీ ట్రాన్స్‌ఫార్మర్ల ఫెయిల్యూర్ ఉండకూడదని చెప్పారు.

లైన్‌మెన్లపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని సూచించారు. లిప్ట్ ఇరిగేషన్‌కు విద్యుత్ చాలా అవసరం కాబ ట్టి నిరంతరం వాటిపై పర్యవేక్షణ ఉండాలని, ఆ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచి ంచారు. ఎటువంటి విద్యుత్ ఫిర్యాదులకైనా 1912కి ఫోన్  చేయాలని ప్రజలను కోరారు. 

ఇక నుంచి ప్రతి నెలా బిల్లులు చెల్లిస్తాం :భట్టి 

గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన వివిధ శాఖల బిల్స్‌ను విడుదల చేసి, ఆయా శాఖల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందని భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్‌లో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇక నుంచి వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నింటిని క్లియర్ చేసి, ప్రతి నెలా రెగ్యులర్‌గా బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుందని చెప్పారు.

దసరా పండుగ కానుకగా పెండింగ్ బిల్లులన్నింటిని క్లియర్ చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ నెల 11న ఈ పాఠశాలల నిర్మాణానికి శంకుస్ధాపన చేయనున్నట్టు వెల్లడించారు. బోనకల్ మండలం లక్ష్మీపురంలో స్థలాన్ని చూశామని, అక్కడ 11న శంకుస్థాపన చేస్తున్నట్టు తెలిపారు.

స్కాలర్‌షిప్స్, కాస్మటిక్స్ చార్జీల, డైట్ బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల జీతభత్యాలు విడుదలలో జాప్యంచేసి, వారిని ఇబ్బందులకు గురి చేశారని, ఇప్పుడా పరిస్థితి లేకుండా ఒకటో తేదీనే జీతాలు విడుదల చేస్తున్నామని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.114 కోట్లను విడుదల చేశామని చెప్పారు.

ఇక నుంచి ప్రతి నెలా 50 శాతం బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. విద్యా శాఖలో చిన్న చిన్న పనులు నిర్వహించే వారి బిల్లులను రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంటే వాటిని కూడా క్లియర్ చేసేలా ఆదేశించారు. మిషన్ భగీరథ అవుట్ సోర్సింగ్ సిబ్బంది పెండింగ్ జీతాలు కూడా క్లియర్ చేసేలా చర్యలు తీసుకున్నామని స్పష్టంచేశారు.