ఒడిశా: దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత పూరీ జగన్నాథ దేవాలయం లోపలి రత్న భాండార్ (నిధి) తాళం ఆదివారం మధ్యాహ్నం తెరుచుకుంది. 46 ఏళ్ల తర్వాత నేడు మధ్యాహ్నం 1.28 గంటలకు పూరీ ఆలయం రత్న భాండారాన్ని కలెక్టర్ సహా హైలెవల్ కమిటీ పర్యవేక్షణలో తెరిచింది. చివరి సారిగా 1978లో పూరీ రత్న భాండాగారాన్ని అధికారులు తెరిచారు. 1978 లో 70 రోజుల పాటు పూరీ రత్న భాండాగారంలోని సంపద లెక్కించారు. జగన్నాథుని సేవలకు అంతరాయం కలగకుండా తెరిచేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పూరీ జగన్నాథ ఆలయంలో హైలెవల్ కమిటీ సమావేశం ఇప్పటికే ముగిసింది. జస్టిస్ విశ్వనాథ్ అధ్యక్షతన సమావేశం కొనసాగింది. కలెక్టర్ సహా హైలెవల్ కమిటీ పర్యవేక్షణలో రత్న భాండాగారం తెరుస్తామని హైలెవల్ కమిటీ వెల్లడించింది.