రెండేళ్లలో ఎస్సెల్బీసీని పూర్తి చేస్తాం
రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి
మిర్యాలగూడలో 4 ఫ్లుఓవర్ల నిర్మాణానికి శంకుస్థాపన
నల్లగొండ, సెప్టెంబర్ 18 (విజయక్రాం తి): రాష్ట్రంలో అర్హులైన పేదలకు త్వర లో ఇ ందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉన్నదని రోడ్లు భవనా లు, సి నిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. మిర్యాలగూడ పట్టణ పరిధిలో రూ.౧౮౦ కోట్లతో చేపట్టనున్న నాలుగు ఫ్లుఓవర్ల నిర్మాణానికి బుధవారం నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, మిర్యాలగూ డ, నాగార్జున సాగర్ ఎమ్మెల్యేలు బత్తుల ల క్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చే శారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. నల్లగొండను అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా నని పేర్కొన్నారు. ఎస్సెల్బీసీ ని రెండేళ్లలో పూర్తి చేసి జిల్లా ప్రజలకు తాగు, సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ ర హదారిని 6 లే న్లుగా విస్తరించున్నామని, ఈ నెల 24న ప నులకు టెండర్లను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. నాగార్జున సాగర్ ఎడ మ కాల్వ నుం చి ఐటిపాముల వరకు గ్రావిటీతో రెండు ప ంటలకు సాగు నిరందించేందుకు కృషి చేస్తామన్నారు.
మిర్యాలగూడలో రూ.10 కోట్లతో నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామ ని చెప్పారు. ఎంపీ రఘువీర్‌రెడ్డి అమృత్ ప థకం కింద రూ.10 కోట్ల నిధులు తెచ్చారని వెల్లడించారు. అంతకుము ందు మిర్యాలగూ డ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున మహ బూబ్‌నగర్‌లో వరద బాధితులకు అందించిన 30 టన్నుల బియ్యం డీసీఎం లను జెండా ఊపి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించారు.