calender_icon.png 28 March, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం

25-03-2025 03:33:41 PM

సోనూసూద్ భార్య సోనాలి సూద్ భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. నాగపూర్ హైవేపై ప్రయాణిస్తున్న సోనాలి సూద్ కారును అదుపుతప్పిన లారీ ఢీకొట్టంది. వెంటనే అప్రమత్తమైన కారు డ్రైవర్ చాకచక్యంగా కారును అదుపు చేశారు. దాంతో పెను ప్రమాదం నుంచి సోనాలి సూద్ తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో సోనాలి సూద్ కు చిన్నచిన్న గాయాలు కావడంతో ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా సోనూసూద్ అభిమానులు ఆందోళనకు గురికావద్దని ఆయన తెలిపారు.