calender_icon.png 23 December, 2024 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొడుకులు, బిడ్డలు తిండి పెడుతలేరు

15-10-2024 12:36:12 AM

మాకు ఆశ్రయం కల్పించండి

అధికారులను కోరిన వృద్ధులు

నిర్మల్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): కొడుకులు, బిడ్డలు వృద్ధాప్యంలో తమను పట్టించుకోవడంలేనది, తిండి పెట్టడం లేదం టూ ఇద్దరు వృద్ధులు వేర్వేరు చోట్ల అధికారులకు ఫిర్యాదు చేశారు. నిర్మల్ పట్టణానికి చెందిన వృద్ధురాలు భోజవ్వ(75) సోమవా రం అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్‌ను ప్ర జావాణి కార్యక్రమంలో కలిసింది.

తనను కొ డుకులు, బిడ్డలు పట్టించుకోవడం లేదని, త న ఆస్తిని పంచుకుని ఒంటరిదాన్ని చేశారని వాపోయింది. వారిపై చర్యలు తీసుకుని తన కు ఆశ్రయం కల్పించాలని వేడుకున్నది స్పం దిచిన అదనపు కలెక్టర్ విచారణ జరిపి న్యా యం చేయాలని అధికారు లకు సూచించారు. భోజవ్వను వృద్ధాశ్రమంలో ఉంచాలని అధికారు లకు సూచించారు. 

నా పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నరు..

కోదాడ, అక్టోబర్ 14: తన కుమారుడు తనను సాకడం లేదని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన సోమపంగు వెంకమ్మ సోమవారం ఆర్డీవో కార్యాలయంలో డీఏవో రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేసింది. మున్సిపాలిటీలో కామాటీగా పదవీ విరమణ పొందానని, పెన్షన్ డబ్బులను కుమారుడు, కోడలు లాక్కుని అన్నం పెట్టడం లేదని బోరుమంది. కూతుళ్లు మాట్లాడేందుకు వస్తే అక్రమ కేసులు పెడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని రోధించింది. తనకు న్యాయం చేయాలని కోరింది.