calender_icon.png 1 February, 2025 | 4:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రపతి ప్రసంగంపై సోనియా గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు

01-02-2025 02:05:47 AM

న్యూఢిల్లీ, జనవరి 31: బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఆవరణలో మీడియా  రాష్ట్రపతి ప్రసంగంపై అభిప్రాయం కోరగా ఆమె స్పందించారు.

‘ప్రసంగం చివరకు వచ్చే సరికి రాష్ట్రపతి బాగా అలసిపోయారు. ఆమె మాట్లాడలేకపోయారు’ అంటూ విచారం వ్యక్తం చేశారు. సోనియా పక్కనే ఉన్న రాహుల్ తన తల్లి వ్యాఖ్యలను సమర్థిస్తూ తలూపారు. రాష్ట్రపతి చెప్పిందే చెప్పి విసుగు తెప్పించినట్టు పేర్కొన్నారు. 

తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు చేసిన బోర్, పూర్ థింగ్ వ్యాఖ్యలను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేతలు తమ వ్యాఖ్యల ద్వారా దేశంలోని 10 కోట్ల మంది గిరిజనులను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ప్రతి పేద వ్యక్తికీ జరిగిన అవమానం గా అభివర్ణించారు.

రాష్ట్రపతి గిరిజన కు టుంబం నుంచి వచ్చినట్టు గుర్తు చేశారు. ఆమె మాతృభాష హిందీ కానప్పటికీ పా ర్లమెంట్‌లో అద్భుతంగా ప్రసంగించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ రాజకుటుంబం రాష్ట్రపతిని అవమానించడం మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తప్పుబట్టిన రాష్ట్రపతి కార్యాలయం

రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ చేసిన వ్యా ఖ్యలను రాష్ట్రపతి కార్యాల యం తప్పుబట్టింది. దేశంలోని అత్యున్నత వ్యక్తి గౌరవానికి భంగం వాటిల్లే లా ప్రవర్తించినట్టు పేర్కొం ది. కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు దురదృష్టకరమంటూ ప్రకటన విడుదల చేసిం ది. ప్రసంగ సమయంలో రాష్ట్రపతి అలసిపోయినట్టు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని పేర్కొంది. 

అవమానించడమే వారి సంప్రదాయం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. దేశంలో అత్యన్నత పదవులను అలంకరించిన వారిని అవమానించే సంప్రదాయాన్ని కాంగ్రెస్ నాయకులు అనాదిగా కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలకు దేశాభివృద్ధి బోరింగ్‌గా మారిందని దుయ్యబట్టారు.