- రాష్ట్రపతితో అన్ని అవాస్తవాలే చెప్పించారు
- మంత్రి సీతక్క
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): సోనియాగాంధీ వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తోందని మంత్రి సీతక్క మండిపడ్డారు. అసలు సమస్యలను పక్కదారి పట్టించేలా లేనిపోని వివాదాలు సృష్టించడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని ఆమె శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రపతి ప్రసంగంలో అన్ని అవాస్తవాలనే కేంద్ర ప్రభుత్వం చేర్చిందని సీతక్క ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి ప్రసంగం సామాన్యులను పూర్తిగా విస్మరించిందని.. నిరుద్యోగ సమస్య, ఆర్థిక రంగ ఒడిదుడుకులను రాష్ట్రపతి ప్రసంగంలో కనిపించలేదన్న విషయాన్ని కప్పిపుచ్చేందుకే సోనియా గాంధీ వ్యాఖ్యలపై వివాదం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఆదివాసీ రాష్ట్రపతిని అవమానించేలా బీజేపీ వ్యవహరించిందన్నారు.
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వనించకుండా బీజేపీ తన కురుచ బుద్ధిని ప్రదర్శించిందని ఫైర్ అయ్యారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఎందుకు ఆహ్వనించలేదని ఆమె ప్రశ్నించారు.