calender_icon.png 22 November, 2024 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్తి కోసం తల్లి అంత్యక్రియలు ఆపేసిన కొడుకు, కూతురు

17-05-2024 08:06:55 PM

సూర్యాపేట : జిల్లాలో అమానుష జరిగింది. తల్లి శవానికి అంత్యక్రియలు జరపకుండా, ఆస్తి కోసం కొడుకు, కుమార్తెలు గొడవకు దిగిన సంఘటన జిల్లాలోని నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంలో ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కందులవారిగూడెంకు చెందిన లక్షమ్మకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చిన్న కొడుకు కొన్నాళ్ల క్రితమే చనిపోయాడు. ఇటీవల ప్రమాదవశాత్తు బాత్ రూంలో జారిపడింది. లక్ష్మమ్మను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే అనారోగ్యంతో చికిత్స పొందుతూ లక్ష్మమ్మ మృతి చెందడంతో కొడుకు, కూతుళ్లు ఆస్తి పంపకాలు పూర్తయ్యే వరకు అంబులెన్స్ ను తరలించేది లేదని తేల్చిచెప్పారు, దీంతో మృతురాలి దగ్గర ఉన్న 21 లక్షల రూపాయల్లో  6 లక్షలు వైద్య ఖర్చులకు కాగా.. మిగిలిన 15 లక్షలు అందరికి సమానంగా పంచుకున్నారు. తల్లి వద్ద ఉన్న 20 తులాల బంగారం ముగ్గురు కూతుళ్లు సమానంగా పంచుకున్నారు. ఆస్తి పంపకాలు అయిన అనంతరం కొడుకు అడ్డం తిరిగాడు. అంత్యక్రియాలకు డబ్బులు ఇస్తేనే తలకొరివి పెడతానంటూ.. అలా అయితేనే తను తలకొరివి పెడతానంటూ.. తేల్చి చెప్పాడు. తండ్రితోపాటు తమ్ముడి అంత్యక్రియలు తానే చేశానని, ఇప్పుడు తల్లి అంత్యక్రియల ఖర్చు తానే భరిస్తే తన పరిస్థితి ఏమిటని ప్రశ్నించాడు. దీంతో లక్ష్మమ్మ అంత్యక్రియలు ఆగిపోగా.. మృతదేహాన్ని ఫ్రీజర్ లోనే ఉంచారు. ఈ గొడవతో గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తూ.. కని పెంచిన తల్లి శవాన్ని ఇంటి ముందు పెట్టుకొని ఘర్షణ పడటం తగదని సూచిస్తున్నారు.