calender_icon.png 14 December, 2024 | 5:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండ్రిని చంపిన తనయుడికి జీవితఖైదు

14-12-2024 12:38:40 AM

ఎల్బీనగర్, డిసెంబర్ 13: గంజాయి మత్తులో తండ్రిని చంపిన కొడుకుకు రంగారెడ్డి జిల్లా కోర్టు శుక్రవారం జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. వివరాలు..రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీకి చెందిన తిరుపతి అనురాగ్(25) చెడు అలవాట్లకు బానిసయ్యాడు.  మత్తుకు దూరంగా ఉండాలని తండ్రి రవీందర్ మందలించేవాడు.

దీంతో పగ పెంచుకున్న అనురాగ్ 2014లో తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడ్డ రవీందర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ కేసు నమోదు కాగా.. ఎల్బీనగర్‌లోని జిల్లా కోర్టు కేసును విచారించింది. ఈ మేరకు జిల్లా కోర్టు న్యాయమూర్తి  అనురాగ్‌ను దోషిగా నిర్ధారిస్తూ జీవితఖైదులో పాటు వెయ్యి రూపాయాల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.