calender_icon.png 15 March, 2025 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నాఫ్ వైజయంతి యుద్ధానికి సిద్ధం

15-03-2025 12:00:00 AM

నందమూరి కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ సినిమాలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.  ఈ యాక్షన్- ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కల్యాణ్ రామ్, విజయశాంతి పాత్రల మధ్య డైనమిక్స్ కీలకంగా ఉండబోతున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్ స్ట్రాంగ్ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసింది.

ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. తాజాగా మూవీ ప్రీ-టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రీటీజర్‌లో కల్యాణ్ రామ్ ఒక పడవపై కూర్చుని, సముద్రం వైపు  చూస్తూ తన చూపులు కదలకుండా కనిపిస్తున్నారు.

రక్తంతో తడిసిన అతని చొక్కా, అతని చుట్టూ ఉన్న అల్లకల్లోలాన్ని సూచిస్తోంది. పడవలు దగ్గరకు వస్తున్నప్పుడు అతని ఫెరోషియస్ లుక్ జరగబోయే పెద్ద యుద్ధాన్ని సూచిస్తోంది.  ప్రీ-టీజర్ జరగబోయే బ్లాస్ట్‌కి టోన్ సెట్ చేసింది. ఇది యాక్షన్ రోలర్ కోస్టర్‌ను అందిస్తోంది. టీజర్ మార్చి 17న విడుదల కానుంది.