29-03-2025 12:36:39 AM
నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సీనియర్ నటి విజయశాంతి పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు.
ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. ఇక మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ను ప్రారంభించబోతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 31న ‘నాయాల్ది..’ అనే పాటను ఫస్ట్ సింగిల్‌గా విడుదల చేయనున్నట్టు చిత్రబృందం తాజాగా ప్రకటించింది.