04-04-2025 12:00:00 AM
నందమూరి కళ్యాణ్‌రామ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కళ్యాణ్‌రామ్ తల్లిగా విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నా రు. తాజాగా మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు.
రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో కళ్యాణ్‌రామ్ ఇంతకు ముందెన్నడూ చూడని మాస్, యాక్షన్ అవతార్‌లో కనిపిస్తున్నారు. సోహైల్ ఖాన్, సయీ మంజ్రేకర్, శ్రీకాం త్, యానిమల్ పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రామ్‌ప్రసాద్; సంగీతం: బీ అజనీష్ లోక్‌నాథ్; ఎడిటర్: తమ్మిరాజు; ఆర్ట్: బ్రహ్మ కడలి; యాక్షన్: రామకృష్ణ, పీటర్ హెయి న్; స్క్రీన్‌ప్లే శ్రీకాంత్ విస్సా; నిర్మాతలు: అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు; రచనాదర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి.