calender_icon.png 4 February, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపిన కొడుకు

04-02-2025 01:30:11 AM

* గంజాయి మత్తులో ఘాతుకం

* గుడిసె ముందున్న ్లపొదల్లోకి ఈడ్చుకెళ్లి పరార్

* మూడు రోజుల తర్వాత వెలుగులోకి.. 

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): తాగుడు, గంజాయి మత్తుకు బానిసైన ఓ కిరాతకుడు తనకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో కన్నతిల్లిని అత్యంత దారుణంగా గోడకు మోది హతమార్చాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న ముళ్లపొదలోకి శవాన్ని ఈడ్చుకెళ్లి పడేసి, పరారయ్యాడు.

ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం మహదేవునిపేటలో సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన ప్రకారం గ్రామానికి చెందిన లేట్ల ఉత్తయ్యకు నాగమ్మ, యాదమ్మ(55) ఇరువురు భార్యలు ఉన్నారు. వారు వేర్వేరు గుడిసెల్లో నివాసముంటూ కూలీపని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

కాగా యాద  కుమారుడు కరుణాకర్(25) తాగుడు, గంజా  బానిసయ్యాడు. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో మూడు రోజుల కింద తల్లి యాదమ్మతో గొడవ పడ్డాడు. గంజాయి మత్తులో తల్లిని గోడకేసి బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో శవాన్ని పక్కనే ఉన్న ముళ్లపొదలోకి ఈడ్చుకెళ్లి, పరారయ్యాడు.

ఆదివారం రాత్రి దుర్వాసన రావడంతో అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కుక్కలు, పందులు కొంతభాగం పీక్కుతిన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించారు. కుమారుడు తిరిగిరావడంతో అదుపులోకి తీసుకొని భర్త ఉత్తయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు విచ్చారిస్తున్నారు.