calender_icon.png 2 April, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లితో వివాహేతర సంబంధం.. వ్యక్తిని హత్య చేసిన కొడుకు

31-03-2025 11:07:59 AM

హైదరాబాద్: వివాహేతర సంబంధాలు వ్యక్తుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. కొందరు తల్లిదండ్రులు చేసే క్షణిక సుఖం కోసం పిల్లలు తప్పటడుగులు వేస్తూ నేరస్తులుగా మారుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనొకటి నగరంలోని కర్మన్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధి(Karmanghat Police Station Area)లోని జానకి ఎన్ క్లేవ్(Janki Enclave)లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

ఆదివారం రాత్రి ఫైనాన్స్ వ్యాపారి(Finance trader)ని యువకుడు కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతుడిని వెంకటేశ్వర్లుగా గుర్తించారు. వివాహేతర సంబంధం ఉన్న మహిళ కుమారుడితో వెంకటేశ్వర్లుకు నిన్న రాత్రి వాగ్వాదం జరిగింది. అది కాస్త ముదరడంతో కోపోద్రిక్తుడైన యువకుడు వెంకటేశ్వర్లుపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఉస్మానియా ఆసుపత్రి(Osmania Hospital)కి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.