31-03-2025 01:18:07 AM
రంజాన్ వేల ముస్లిం కుటుంబంలో విషాదం
గజ్వేల్, మార్చ్ 30 : తల్లిని తిట్టాడని క్షణికావేశంలో తండ్రి నీ కొడుకు చంపిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం మహమ్మద్ షాబుద్దీన్ అతని భార్య రజియా బేగం, కొడుకు షాకీర్లకు మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి.
శనివారం అర్ధరాత్రి కూడా చిన్నపాటి గొడవ కాగా షాబుద్దీన్ భార్య రజియాను అసభ్య పదజాలంతో దూషించాడు. ఆ మాటలకు కోపం తెచ్చుకున్న కొడుకు షాకీర్ ఇంట్లోని ప్రెషర్ కుక్కర్ మూతతో షాబుద్దీన్ తలపై భాదాడు. ఆ దెబ్బకు కింద పడిపోయిన షాబుద్దీన్ మెడకు తాడు బిగించి చంపేశారు.
రాత్రి రెండు గంటల ప్రాంతంలో షాకీర్ సోదరి సఫియా కు ఫోన్ చేసి తండ్రి షాబుద్దీన్ పిడుసు వచ్చి పడిపోయాడని సమాచారం ఇచ్చాడు. సమాచారం తెలుసుకున్న సఫియా, మహబూబ్ పాషా ఇంటికి చేరుకొని షాబుద్దీన్ ను పరిశీలించారు.
అప్పటికే షాబుద్దీన్ చనిపోయి ఉండగా జరిగిన విషయాన్ని రఫియా షాకీర్లు వెల్లడించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించగా రఫియా షాకీర్ తండ్రి షాబుద్దీన్ ను ప్రెషర్ కుక్కర్ మూతతో కొట్టి చంపినట్లు ఒప్పుకున్నారు. ఈ విషయమై షాబుద్దీన్ సోదరుడు షాదుల్లా పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.