న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అనుమతించకపోవడంతో తల్లిని హత్య చేసినందుకు 22 ఏళ్ల వ్యక్తిని శనివారం అరెస్టు చేశారు. సామన్(22)కు ఇటీవల తల్లి, అన్న పెళ్లి నిశ్చయం చేశారు. తాను ప్రేమించిన అమ్మాయిని చేసుకుంటానని సామన్ తల్లితో చెప్పాడు. ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని కోపంతో తల్లిని అడ్డుతొలగించాడు. తన తల్లిని దొంగలు చంపారని సావన్ పోలీసులను నమ్మించాడు. తల్లిని చంపి ఒంటిపై బంగారాన్ని ఎత్తుకెళ్లారని చెప్పాడు. ఢిల్లీ పోలసుల విచారణలో అసలు నిజం వెలుగుచూసింది.
అతని తల్లి అతన్ని మందలించిందని, అతను సమస్యను మరోసారి ప్రస్తావిస్తే, వారి ఆస్తి నుండి తనకు ఏమీ రాదని బెదిరించిందని చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన సావన్ తన ఆమెను హత్య చేయాలని ప్లాన్ చేశాడని పోలీసులు తెలిపారు. కొన్ని గంటల్లోనే నేరాన్ని అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. మరణించిన సులోచనకు దాదాపు 45 సంవత్సరాలు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కపిల్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. 22 సంవత్సరాల వయస్సు గల సావన్ సరుకు రవాణా కోసం ఛాంపియన్ వాహనాన్ని నడుపుతున్నాడు. ఈ ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.