పేకాట ఆ డడానికి డబ్బులు అడిగిన తనయుడు
నిరాకరించిన తండ్రి
అదే కోపంతో తండ్రిని హత్య చేసిన తనయుడు
కామారెడ్డి జిల్లాలో కలకలం
కామారెడ్డి, (విజయ క్రాంతి): కనీ పెంచి పెద్ద చేసి కట్టే కాలేవరకు తమకు అండగా నిలుస్తాడని ఆశించిన తల్లిదండ్రులకు కొడుకులే యమ పాషలుగా మారుతున్నారు. పేకాట ఆడేందుకు డబ్బులు ఇవ్వనీ పాపానికి ఓ తండ్రిని హత్య చేసిన తనయుని ఉదంతం కామారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం నెమలి గ్రామానికి చెందిన సాయిబోయి 55 నీ కన్నకొడుకే హానుమండ్లు గురువారం రాత్రి కర్రతో కొట్టి హత్య చేశాడు. కానీ పెంచి పెద్ద చేసి చదువు చెప్పిన తండ్రిని పేకాటకు డబ్బులు ఇవ్వను అన్నందుకే హత్య చేయడం జిల్లాలో కలకలం రేపింది.
నెమలి గ్రామానికి చెందిన సాయబోయికి ఒకే కొడుకు హనుమాన్లు కావడంతో ఎంతో ప్రేమతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. కొడుకు ప్రయోజకుడు అవుతాడని భావించిన తల్లిదండ్రులకు కొడుకు హనుమాన్లు స్నేహితులతో కలిసి జులాయిగా తిరుగుతూ పేకాట కు అలవాటుపడ్డాడు. దీపావళి లక్ష్మీ పూజలు కావడంతో పేకాట ఆడే సంస్కృతి ఉమ్మడి కామారెడ్డి నిజాంబాద్ జిల్లాలో ఉంది. దీంతో అనుమాండ్లు తన తండ్రిని డబ్బులు అడిగాడు. పేకాట ఆడేందుకు తాను డబ్బులు ఇవ్వనని నిరాకరించాడు. దీంతో కోపాన్ని తెచ్చుకున్న హనుమన్లు తన తండ్రిని కర్రతో బాధడంతో తండ్రి సాయిబోయి అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటికే హను మండ్లు తాగి ఉండడంతో కోపంతో తండ్రిని కర్రతో బాధడంతో తలకు తగిలి సాయిబోయి మృతి చెందాడు ఈ సంఘటనకు గ్రామస్తులు తండ్రిని హతమార్చిన కొడుకు తీరును చూసి శాపనార్థాలు పెట్టారు. హనుమాన్లు తండ్రిని చంపి పరారయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శుక్రవారం నసురుల్లాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది.