అవారాగా తిరుగొద్దని మందలించాడని ఘాతుకం.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన.
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): తాగుడుకు బానిపై ఆవారాగా తిరుగుతున్న కొడుకును మందలించాడని కన్నతండ్రినే గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం గట్టునెల్లికుదురు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం... తెలకపల్లి మండలం గట్టునెల్లికుదురు గ్రామానికి చెందిన బింగి సుల్తాన్ (50) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అత్యంత గారాబంగా పెంచుకున్న తన కుమారుడు మల్లేష్ జల్సాలకు అలవాటు పడి ఆవారాగా తిరుగుతున్నాడని తండ్రి మందలించాడు. దీంతో కోపం పెంచుకొని రాత్రి నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపాడు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.