22-02-2025 03:46:08 PM
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి(Medchal-Malkajgiri) జిల్లా ఈసీఐఎల్(ECIL)లో దారుణం చోటుచేసుకుంది. కుమారుడి చేతిలో తండ్రి హత్యకు గురయ్యాడు. ఈసీఐఎల్ బస్టాప్ లో కుమారుడు తండ్రిపై కత్తితో దాడి చేశాడు. ఐసీఐఎల్ కూడలిలో నడిరోడ్డుపై తండ్రి మొగిలి(45)ని కుమారుడు 10-15 సార్లు కత్తితో పొడిచాడు. బాధితుడు మొగిలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆస్తి తగాదాలతోనే తండ్రిపై కొడుకు దాడి చేసినట్లు సమాచారం. నిందితుడు సాయి(25)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.