చండీగఢ్, ఆగస్టు 3: చండీగఢ్‌లోని కుటుంబ న్యాయస్థానంలో శనివారం అన్యూహ పరిణామం చోటుచేసుకొన్నది. కుటుంబ కలహాలతో కోర్టుకు వచ్చిన అల్లుడిని పిల్లనిచ్చిన మామ దారుణంగా కాల్చి చంపాడు. నిందితుడు, బాధితుడు ఇద్దరూ ఉన్నతోద్యోగులే కావటం గమనార్హం. నిందితుడు మాల్విందర్‌సింగ్ సిద్దూ పంజాబ్ పోలీస్ శాఖలో అసిస్టెంట్ ఐజీ ర్యాంకు అధికారి. ఆయన ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నారు. ఆయన అల్లుడు, మృతుడు హర్‌ప్రీత్‌సింగ్ నీటిపారుదల శాఖలో ఐఆర్‌ఎస్ అధికారి. వీరి మధ్య కొన్నాళ్లుగా కుటుంబ కలహాలు నడుస్తున్నారు. వాటిని పరిష్కరించుకొనేందుకు శనివారం కోర్టులో మీడియేషన్ సెషన్‌కు హాజరయ్యారు. ఆ సమయంలో బాత్‌రూంకు వెళ్లిన సిద్దూకు అల్లుడు హర్‌ప్రీత్ ఎదురుపడటంతో తనవద్ద ఉన్న తుపాకీతో కాల్చేశాడు.