25-03-2025 12:48:41 AM
వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ
సూర్యాపేట, మార్చి24 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా మిర్యాల గ్రామ మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్య హత్య కేసులో సొంత కుటుంబ సభ్యులే నిందితులని ఎస్పీ నరసింహ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు.
చక్రయ్య గౌడ్ హత్యలో అతని అల్లుళ్లు, కూతుర్లే ప్రధాన నిందుతులని తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అల్లుడు వెంకన్న, అతడి భార్యతో పాటు 13 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. రెండు కార్లు, ఒక కర్ర, 10 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన నిందితులను త్వరలోనే పట్టుకుంటున్నారు.