07-04-2025 08:39:10 AM
హైదరాబాద్: జగిత్యాల జిల్లా(Jagtial District)లోని మల్యాల రాజారాం గ్రామంలో ఆదివారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. కన్న తల్లిదండ్రులపై ఓ కుమారుడు కొడవలి, గడ్డపలుగుతో దాడి చేశాడు. భూతగాదాలతో కొడుకు నరేశ్ తల్లిదండ్రులపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. కుమారుడి దాడిలో తండ్రి నాగరాజు, తల్లి గంగమణికి తీవ్ర గాయాయల్యాయి. గాయపడిన దంపతులను జగిత్యాల ఆస్పత్రి(Jagtial Hospital)కి తరలించారు. దంపతుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.